కారుకొండ బౌద్ధ ఆరామాలను రక్షించండి.. కలెక్టర్ కు బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వినతి

దిశ ప్రతినిధి, ఖమ్మం: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన ప్రముఖ కారుకొండ బౌద్ధ ఆరామాలకు రక్షణ కల్పించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు సిద్దెల రవి ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిద్దెల రవి మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న చారిత్రక నేపథ్యం గల ప్రసిద్ధ కారుకొండ బౌద్ధ ఆరామాలను కొందరు అన్యాక్రాంతం చేసి, బుద్ధుని […]

Update: 2021-10-04 05:34 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన ప్రముఖ కారుకొండ బౌద్ధ ఆరామాలకు రక్షణ కల్పించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు సిద్దెల రవి ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిద్దెల రవి మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న చారిత్రక నేపథ్యం గల ప్రసిద్ధ కారుకొండ బౌద్ధ ఆరామాలను కొందరు అన్యాక్రాంతం చేసి, బుద్ధుని సూత్రాలకు విరుద్ధంగా జంతుబలులు చేస్తూ, మద్యం సేవిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారన్నారు.

ఆరామాల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై తక్షణమే స్పందించి ఆరామాల రక్షణ, అభివృద్ధి కోసం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్రాంతంలో రెండు గదులు షెడ్ నిర్మించి, ఇదివరకే బోరు వేయడం జరిగిందని, మంచినీటి సౌకర్యం కల్పించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కాగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సిద్దెల రవి తెలిపారు.

Tags:    

Similar News