అటవీ ప్రాంతంలో గుట్టుగా కోడి పందాలు.. 9 మంది అరెస్టు
దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై భూపాల్ పల్లి ఎస్ఐ అభినవ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు. బలగాల రాకను ముందే గమనించిన నిర్వహకులు పారిపోయినట్టు సమాచారం. అయితే, కోడి పందాలు ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 వరకు కోడిపుంజులు, కొంతమేర నగదు, 20కు పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 మందికి పైగా కోడి పందాల్లో […]
దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై భూపాల్ పల్లి ఎస్ఐ అభినవ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు. బలగాల రాకను ముందే గమనించిన నిర్వహకులు పారిపోయినట్టు సమాచారం. అయితే, కోడి పందాలు ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుమారు 50 వరకు కోడిపుంజులు, కొంతమేర నగదు, 20కు పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 మందికి పైగా కోడి పందాల్లో పాల్గొనట్టు సమాచారం. నందిగామ అనే ప్రాంతంలో గత కొన్ని నెలలుగా ఈ కోడిపందాలు నిర్వహిస్తు్న్నట్టు తెలిసింది. ఈ విషయమై భూపాలపల్లి ఎస్సై అభినవ్‌ను వివరణ కోరగా, కోడి పందాలు ఆడిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. నిర్వహకులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.