‘శుభలగ్నం’ మూవీ రిపీట్.. భర్తను అమ్మేసిన భార్య !
దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్ మూవీ ‘శుభలగ్నం’. ఈ సినిమా వచ్చి చాలా ఏళ్లయినా గతంలో చూసినోళ్లకు, ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తునోళ్లకు ఇదొక సూపర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. డబ్బుకు ఆశపడిన భార్య.. భర్తకు వేరే మహిళతో పెళ్లిచేయడం అనే కాన్సెప్ట్‌కు తోడు ‘చిలకా ఏ తోడులేక సాంగ్’ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. జగపతిబాబు, ఆమని, రోజా నటన మూవీలో మరో హైలైట్. కాగా ఈ సినిమా నుంచి ఏదైనా సాంగ్ గానీ, డైలాగ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్ మూవీ ‘శుభలగ్నం’. ఈ సినిమా వచ్చి చాలా ఏళ్లయినా గతంలో చూసినోళ్లకు, ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తునోళ్లకు ఇదొక సూపర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. డబ్బుకు ఆశపడిన భార్య.. భర్తకు వేరే మహిళతో పెళ్లిచేయడం అనే కాన్సెప్ట్‌కు తోడు ‘చిలకా ఏ తోడులేక సాంగ్’ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. జగపతిబాబు, ఆమని, రోజా నటన మూవీలో మరో హైలైట్. కాగా ఈ సినిమా నుంచి ఏదైనా సాంగ్ గానీ, డైలాగ్ గానీ వినిపిస్తే చాలు.. ఆ సినిమా మొత్తం కళ్లముందు ఇట్టే కదలాడుతుందంటే అతిశయోక్తి కాదు. అంతలా ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది ‘శుభలగ్నం’. ఇదంతా రీల్ లైఫ్ స్టోరీ కాగా, ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళ కోట్ల రూపాయల ఆస్తి కోసం తన భర్తను అమ్మకానికి పెట్టింది. అసలు ఆ కథ ఎలా మొదలైంది? ఎటువంటి మలుపులు తీసుకుందో పూర్తి వివరాలు మీ కోసం..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇంటి యజమాని.. తను పనిచేస్తున్న ఆఫీస్‌లోనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని.. భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. దీంతో ఫ్యామిలీ మొత్తం డిస్ట్రబ్ అవుతోంది. ఇంట్లో నెలకొన్న పరిస్థితులను భరించలేకపోయిన పెద్దకూతురు తనతండ్రిపై స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ మహిళతో మా నాన్న అక్రమ సంబంధం పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నాడని, తరచూ గొడవలు జరుగుతుండటం వల్ల చెల్లి చదువుకు డిస్ట్రబ్ అవుతోందని తెలిపింది. ఇదే క్రమంలో రెండుమూడు సార్లు పోలీసులు నచ్చజెప్పినా ఎటూ తేలకపోవడంతో చివరకు విషయం కాస్తా ఫ్యామిలీ కోర్టుకు చేరింది.
ఫ్యామిలీ మెంబర్స్ అంతా కౌన్సెలింగ్‌కు హాజరైన క్రమంలోనూ ఆ వ్యక్తి.. తను ఎఫైర్ పెట్టుకున్న మహిళతో ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే అతడి నిర్ణయాన్ని అంగీకరించని భార్య.. తనతోనే ఉండాలని తెగేసి చెప్పింది. ఇలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్‌లు జరిగినా లాభంలేకపోయింది. దీంతో విసిగివేసారిన ఆ మహిళ పెట్టిన ఓ కండిషన్.. సమస్యకు పరిష్కారం చూపడం విశేషం. అదేంటంటే.. తన భర్తను సదరు మహిళకు అప్పగించాలంటే ఖరీదైన ప్లాట్‌తో పాటు రూ.27లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఈ షరతుకు ఆమె భర్త, ప్రియురాలు ఓకే చెప్పడంతో కథ సుఖాంతమైంది. అయితే ఆ మహిళ అడిగిన ఫ్లాట్ ధర రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. తన పిల్లల ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకొనే అంత డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ మహిళ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఒప్పందం ఎప్పటికి ఓకే అవుతుందో తెలీదు కానీ.. ‘శుభలగ్నం’ సినిమాను తలపించిన ఈ ఎపిసోడ్ ఓ హిస్టరీనే.