కంటికి కనపడని శత్రువుతో జాగ్రత్త : శృతి
శృతి హాసన్… సినిమా షూటింగ్ లను మిస్ అవుతున్నట్లు చెప్తోంది. అందరితో కలిసి పని చేయడాన్ని చాలా చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. కానీ…మనం ఐసొలేషన్ లో ఉండక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అలాంటిదని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా అంటే…బయటకి వెళ్లి జల్సా చేయమని కాదు.. పార్టీలు చేసుకోమని కాదు.. మీకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి అని చెప్తోంది శృతి. మనకు కనబడని శత్రువుతో పోరాడుతున్నాం.. అసలు అదేంటో కూడా మనకు […]
శృతి హాసన్… సినిమా షూటింగ్ లను మిస్ అవుతున్నట్లు చెప్తోంది. అందరితో కలిసి పని చేయడాన్ని చాలా చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. కానీ…మనం ఐసొలేషన్ లో ఉండక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అలాంటిదని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా అంటే…బయటకి వెళ్లి జల్సా చేయమని కాదు.. పార్టీలు చేసుకోమని కాదు.. మీకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి అని చెప్తోంది శృతి. మనకు కనబడని శత్రువుతో పోరాడుతున్నాం.. అసలు అదేంటో కూడా మనకు అర్థం కావడం లేదు.. కావున ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తోంది. ఈ సమయాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేందుకు వినియోగించండి… మీకు మీరు కొత్త సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేయండి అని సూచించింది శృతి. మీరు జీవితంలో పొందిన సంపదకు, ఆహారానికి, గొప్ప కుటుంబం, స్నేహితులు పొందినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోమని చెప్తోంది. లవ్ యూ ఆల్ అంటూ పోస్ట్ పెట్టిన శృతి… జాగ్రత్తగా ఉండాలని కోరింది.
కాగా ఈ మధ్య సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న శృతి హాసన్.. రవితేజ సరసన క్రాక్ సినిమాలో కనిపించబోతోంది. వకీల్ సాబ్ సినిమాలోనూ పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా… అది వాస్తవం కాదని చెప్పింది. కొన్ని తమిళ ప్రాజెక్ట్ లకు శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Tags: Shruti Hassan, Coronavirus, Covid 19, Raviteja, Krack, Tollywood