జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు
దిశ, నల్లగొండ: శాలిగౌరారం మండలంలోని గురజాల గ్రామ సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని న్యాయవాది అప్పల రమేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ విచారణ జరిపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మూసీనది నుంచి శాండ్ ట్యాక్స్ విధానంలో జరిగే ఇసుక రవాణాను అరికట్టేలా, శాండ్ రీచ్‌ను రద్దు చేసేలా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుల పక్షాన తీర్పు ఇవ్వాలని […]
దిశ, నల్లగొండ: శాలిగౌరారం మండలంలోని గురజాల గ్రామ సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని న్యాయవాది అప్పల రమేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ విచారణ జరిపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మూసీనది నుంచి శాండ్ ట్యాక్స్ విధానంలో జరిగే ఇసుక రవాణాను అరికట్టేలా, శాండ్ రీచ్‌ను రద్దు చేసేలా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుల పక్షాన తీర్పు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.