షాపులు, మార్కెట్లు నాలుగు గంటలే ఓపెన్
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న కట్టడి చర్యలకు మరిన్ని కఠిన ఆంక్షలను జోడించింది. అన్ని రకాల షాపులు, ఫుడ్ ఔట్‌లెట్లు, ముడి సరుకుల దుకాణాలు రోజులో కేవలం నాలుగు గంటలే ఓపెన్ చేయాలని తాజాగా ఆదేశించింది. సరుకులు, కూరగాయలు, పండ్లు, డైరీ, బేకరీలు, అన్ని రకాల ఫుడ్ షాపులు(చికెన్, మటన్, ఫిష్ షాపులు సహా), సాగు ఉత్పత్తి అమ్మే దుకాణాలు అన్నీ ఇక నుంచి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల […]
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న కట్టడి చర్యలకు మరిన్ని కఠిన ఆంక్షలను జోడించింది. అన్ని రకాల షాపులు, ఫుడ్ ఔట్‌లెట్లు, ముడి సరుకుల దుకాణాలు రోజులో కేవలం నాలుగు గంటలే ఓపెన్ చేయాలని తాజాగా ఆదేశించింది. సరుకులు, కూరగాయలు, పండ్లు, డైరీ, బేకరీలు, అన్ని రకాల ఫుడ్ షాపులు(చికెన్, మటన్, ఫిష్ షాపులు సహా), సాగు ఉత్పత్తి అమ్మే దుకాణాలు అన్నీ ఇక నుంచి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే, హోం డెలివరీ సేవలకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతినిచ్చింది. వీటికీ అదనంగా ఆంక్షలు జోడించే అవకాశాన్ని స్థానిక పాలికలకు కల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలన్నింటిని కలిపి సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్‌డౌన్ అని మాత్రం ఉచ్చరించలేదు.