Delhi: ఒకేచోట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు..
రాష్ట్రపతి భవనంలో శుక్రవారం ఉదయం అల్పాహారం విందు ఏర్పాటు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి భవనంలో శుక్రవారం ఉదయం అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు చెందిన ఎంపీలతో కలిసి అల్పాహారం, తేనీరు తీసుకున్నారు.
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు ఈటల రాజేందర్, అరవింద్కమార్, డీకే అరుణ, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గూడెం నాగేశ్, రాజ్యసభ్యులు లక్ష్మణ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, అనిల్‌కుమార్‌యాదవ్, కడియం కావ్య, రామసహయం రాఘురాంరెడ్డి, కుందురు జయవీర్‌రెడ్డి, బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు తదితరులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలిశారు. అనంతరం రాష్ట్రపతితో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.