నేను హోమ్ శాఖ అడగనేలేదు.. రాజగోపాల్ రెడ్డి క్లారిటీ!
తనకు హోంశాఖ ఇవ్వాలని... కాంగ్రెస్ ( Congress) అధిష్టానాన్ని ఎక్కడ అడగలేదని... హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ మునుగోడు ఎమ్

దిశ, డెస్క్ : తనకు హోంశాఖ ఇవ్వాలని... కాంగ్రెస్ ( Congress) అధిష్టానాన్ని ఎక్కడ అడగలేదని... హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy ) కీలక ప్రకటన చేశారు. తనకు హోం శాఖ అంటే ఇష్టమని చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదంతా ఫేక్ ప్రచారమని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ కేబినెట్ ( Telangana Cabinet) విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు హోం మంత్రి శాఖ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.
ఇలాంటి నేపథ్యంలోనే స్వయంగా రాజగోపాల్ రెడ్డి... ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు హోం శాఖ ఇవ్వాలని ఎక్కడ అడగలేదని వివరించారు. హోం శాఖ ( Home Ministry) మంత్రి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ అలాగే కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు... చిట్ చాట్ లో మాత్రమే చెప్పినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ దే తుది నిర్ణయం.. స్టేట్మెంట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఏ శాఖ ఇచ్చిన బాధ్యత యుతంగా పనిచేస్తానని... సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా.. ఏప్రిల్ మూడవ తేదీన తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు కూడా సమాచారం. అయితే ఉత్తంకుమార్ రెడ్డి భార్యకు మాత్రం మంత్రి పదవి లేనట్లే అని సమాచారం అందుతుంది.