పిఠాపురంలో కోటిన్నరతో జంప్
దిశ ఏపీ బ్యూరో: చెల్లించిన సొమ్ముకు రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ నమ్మబలికి గడువు ముగిసిన తరువాత బోర్డు తిప్పేసిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కేశబోయిన సతీష్‌బాబు 2018లో పిఠాపురంలో సిరి ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఒక షాపును ఏర్పాటు చేశాడు. నెలకు రూ.500 చొప్పున 20 నెలల పాటు (రూ.పదివేలు) చెల్లిస్తే ప్రతి నెలా లక్కీడ్రా తీసి దానికి రెట్టింపు […]
దిశ ఏపీ బ్యూరో: చెల్లించిన సొమ్ముకు రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ నమ్మబలికి గడువు ముగిసిన తరువాత బోర్డు తిప్పేసిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కేశబోయిన సతీష్‌బాబు 2018లో పిఠాపురంలో సిరి ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఒక షాపును ఏర్పాటు చేశాడు. నెలకు రూ.500 చొప్పున 20 నెలల పాటు (రూ.పదివేలు) చెల్లిస్తే ప్రతి నెలా లక్కీడ్రా తీసి దానికి రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ నమ్మబలికాడు. దీంతో పిఠాపురం దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది ఆ స్కీంలో చేరారు. గడువు ముగిసిపోయినా ఎలాంటి గిఫ్టులు రాలేదు. దీంతో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ రాహుల్‌ను పట్టుకోగా మోసపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.