టీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో అవమానం
దిశ, మణుగూరు: పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శుక్రవారం బూర్గంపాడు మండలం పర్యటనలో అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పుట్టినరోజు సందర్భంగా సంతోషంలో గడిపిన రేగా బూర్గంపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టాల్సింది ఉండగా.. పర్యటనకు ముందే అపశృతులు చోటుచేసుకున్నాయి. మండల కేంద్రంలోని నకిరిపేట గ్రామంలో రేగా పర్యటన కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలపై గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని […]
దిశ, మణుగూరు: పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శుక్రవారం బూర్గంపాడు మండలం పర్యటనలో అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పుట్టినరోజు సందర్భంగా సంతోషంలో గడిపిన రేగా బూర్గంపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టాల్సింది ఉండగా.. పర్యటనకు ముందే అపశృతులు చోటుచేసుకున్నాయి. మండల కేంద్రంలోని నకిరిపేట గ్రామంలో రేగా పర్యటన కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలపై గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలపై,పేడ ముద్దలు కొట్టి రోడ్డు శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే ఘటనకు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జరిగిన ఘటనపై రేగా కాంతారావు పార్టీ నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రేగా పర్యటన యధావిధిగా సాగగా ఫ్లెక్సీల సంఘటన చోటు చేసుకున్న ప్రదేశంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. కాగా, శిలాఫలకం ధ్వంసం ఫ్లెక్సీలపై పేడ ముద్దల ఘటనపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి ఎటువైపు దారి తీస్తుందోనని చర్చలు నడుస్తున్నాయి.