జగన్‌కు షాక్.. ఏపీ ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం

దిశ, ఏపీ బ్యూరో: దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ్యులపై ఐఏఎన్ఎస్-సీ ఓటర్ చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రజాగ్రహం ఉన్న శాసనసభ్యుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు అగ్రస్థానంలో నిలిచారు. ప్రజాగ్రహంలో 28.5 శాతంతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ప్రజాగ్రహంలో రెండో స్థానంలో గోవా, మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. అతి తక్కువ ప్రజాగ్రహం ఉన్న ఎమ్మెల్యేలలో 6.8 శాతంతో కేరళ నిలిచినట్లు సర్వేలో వెల్లడైందని ఐఏఎన్ఎస్-సీఓటర్ […]

Update: 2021-10-19 08:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ్యులపై ఐఏఎన్ఎస్-సీ ఓటర్ చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రజాగ్రహం ఉన్న శాసనసభ్యుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు అగ్రస్థానంలో నిలిచారు. ప్రజాగ్రహంలో 28.5 శాతంతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ప్రజాగ్రహంలో రెండో స్థానంలో గోవా, మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. అతి తక్కువ ప్రజాగ్రహం ఉన్న ఎమ్మెల్యేలలో 6.8 శాతంతో కేరళ నిలిచినట్లు సర్వేలో వెల్లడైందని ఐఏఎన్ఎస్-సీఓటర్ సర్వే వెల్లడించింది.

మరోవైపు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం తగ్గిందని తెలిపింది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 3శాతం ఓటింగ్ తగ్గిందని తెలిపారు. అయితే టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగిందని ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. అయితే వైసీపీ ఎంపీలు మాత్రం ఓటర్ల నుంచి తక్కువ కోపాన్ని ఎదుర్కోవడం గమనార్హం.

Tags:    

Similar News