Supreme Court: క్రిమినల్ కేసుల్లో తెలంగాణ సహకరించడం లేదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో విచారణకు రాష్ట్ర డీజీపీ హాజరయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: క్రిమినల్ కేసుల విచారణలో కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని సుప్రీంకోర్టు శుక్రవారం విచారం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ హయాంలో తనపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ మాజీ నేత వట్టె జానయ్య దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇటీవల సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు రాష్ట్ర డీజీపీ జితేందర్ వర్చువల్ గా హాజరయ్యారు. ఛార్జిషీట్‌లో తేదీలను పేర్కొనకపోవడం వల్ల అధికారుల పొరపాటు జరిగిందని, అందుకు బాధ్యులైన సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీకి కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ న్యాయవాదికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ను పూడ్చడంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా డీజీపీని ధర్మాసనం ఆదేశించింది.