Red Roads: హైదరాబాద్ నగరంలో ఎరుపెక్కిన రహదారులు.. అవాక్కైన జనం
హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో రహదారులు ఎరుపెక్కాయి.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో రహదారులు ఎరుపెక్కాయి. అయినా.. రోడ్లు ఎరుపు రంగులోకి మారడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల (Jeedimetla) పారిశ్రామికవాడను ఆనుకుని ఉన్న సుభాష్‌నగర్ డివిజన్ (Subhash Nagar Division) వెంకటాద్రి నగర్ (Venkatadri Nagar)లో సోమవారం సాయంత్రం రోడ్లపై ఉన్నట్టండి ఎరుపు రంగులో ఉన్న నీరు ప్రవహించింది. ఆ నీళ్లను చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని స్థానికులు చూడగా.. ఓ మ్యాన్‌హోల్ నుంచి ఉబికి వస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో వెంకటాద్రి నగర్ (Venkatadri Nagar)లోని రెండు రోడ్లలో ఎరుపు నీరు ఏరులై పారుతోంది. వాటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాంల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుస్తుండటంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.