బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మల్లారెడ్డి భేటీ.. కారణమిదే!

బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన వినూత్న స్పీచులతో సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Update: 2024-10-04 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన వినూత్న స్పీచులతో సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. రాజకీయ బహిరంగ సభల్లో తనదైన శైలిలో డాన్సులు చేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో ముందుండేవారు. తాజాగా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి మనుమరాలి వివాహానికి ఆహ్వానించేందుకు శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులతో కలిసి మల్లారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్‌ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.


Similar News