ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు ప్రజలు ఝలక్

దిశ, అందోల్: ప్రభుత్వ పథకాలు రావాలన్నా…మన ప్రాంతం అభివృద్ధి  జరగాలన్నా… అందోల్  ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ రాజీనామా చేయాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు జోరందుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా.. ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం, కొత్త పథకాలను ప్రవేశపేట్టడం, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ దళిత బంధు అనే కొత్త పథకానికి శ్రీకారం […]

Update: 2021-07-31 06:06 GMT

దిశ, అందోల్: ప్రభుత్వ పథకాలు రావాలన్నా…మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా… అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ రాజీనామా చేయాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు జోరందుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా.. ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం, కొత్త పథకాలను ప్రవేశపేట్టడం, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ దళిత బంధు అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.

అభివృద్ది కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం, పనులను చేపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్‌ ప్రత్యేక అకర్షణగా నిలుస్తొంది. హుజురాబాద్‌ మాదిరిగానే అందోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే అభివద్ది జరుగుతుందని,‘మన అందోల్ కు దళిత బంధు’ రావాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే అంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. ‘మా ఓట్ల ద్వారా గెలిచిన గౌరవ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ గారికి నమస్కారం…తెలంగాణలో నూతన ఒరవడికి సీఎం కేసీఆర్‌ గారు శ్రీకారం చుట్టారు. మన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం…మన ప్రాంత అభివృద్ది కోసం… .రాజీనామా ఒక్కటే అభివృద్దికి మార్గం… మన పేద కుటుంబాలకు సహయం చేసినవారవుతారు… మీ రాజీనామాతో స్థానిక సత్తాను ఏంటో సీఎం కేసీఆర్‌కు తెలుస్తది…తిరిగి ఉప ఎన్నికల్లో మీకే ఓటేసి గెలిపించుకుంటాం’ అంటూ సోషల్‌ మీడియాలో వీడియో, టెక్ట్స్‌ మెసేజ్‌లు వైరల్‌ అవుతున్నాయి.

వాట్సాఫ్‌, ఫేస్‌ బుక్‌ వంటి ఇతరత్రా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో అందోల్ నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఈ మెసెజ్‌కు కొందరు నెటిజన్లు…అవును రాజీనామా చేస్తే బాగుంటుంది…మన ప్రాంత అభివృద్ది కోసం క్రాంతి కిరణ్‌ ప్రయత్నాలు చేస్తున్నా…నిధులు మంజూరు కాకపోవడంతో…ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది…అభివృద్ది కోసం రాజీనామా చేసి..ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ది జరుగుతుందంటూ రిప్లయ్‌ ఇస్తున్నారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన కోమ‌టిరెడ్డి

Tags:    

Similar News