భారత్‌కు సాయం చేయండి.. అభిమానులకు మాజీ పాక్ క్రికెటర్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్‌కు సహాయంగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆ దేశ ప్రభుత్వాన్ని, ప్రజలను, అభిమానులను కోరాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ‘కరోనాపై పోరాటం చేస్తున్న పొరుగుదేశం భారత్‌కు సహాయపడండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితిని హ్యాండిల్ చేయడం ఎలాంటి ప్రభుత్వానికైనా కష్టంతో కూడుకున్న పనే. కాబట్టి భారత్‌కు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని, ప్రజలను, నా అభిమానులను కోరుతున్నాను. […]
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్‌కు సహాయంగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆ దేశ ప్రభుత్వాన్ని, ప్రజలను, అభిమానులను కోరాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ‘కరోనాపై పోరాటం చేస్తున్న పొరుగుదేశం భారత్‌కు సహాయపడండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితిని హ్యాండిల్ చేయడం ఎలాంటి ప్రభుత్వానికైనా కష్టంతో కూడుకున్న పనే. కాబట్టి భారత్‌కు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని, ప్రజలను, నా అభిమానులను కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్‌కు ఆక్సిజన్ ట్యాంకులు అవసరం. అందుకోసం పెద్ద ఎత్తున విరాళాలు అందించాలనీ.. సేకరించాలని అభిమానులను కోరుతున్నాను’ అని వీడియోలో కోరాడు.