సన్సాద్ టీవీ షో నుంచి తప్పుకున్న రాజ్యసభ  ఎంపీ

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ సంసద్ టీవీ షో వ్యాఖ్యాతగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘సన్సాద్ టీవీలో మేరీ కహనీ షోలో వ్యాఖ్యాతగా వైదొలగడం బాధగా ఉంది. నేను సంసద్ టీవీలో ఒక కార్యక్రమం కోసం ఉండటానికి ఇష్టపడ్డాను. కానీ, ఏకపక్ష సస్పెన్షన్ కారణంగా పార్లమెంటు విధులను నిర్వర్తించడానికి నిరాకరించబడ్డాను. అందుకే నేను షోకు ఎంత […]

Update: 2021-12-05 09:07 GMT

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ సంసద్ టీవీ షో వ్యాఖ్యాతగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘సన్సాద్ టీవీలో మేరీ కహనీ షోలో వ్యాఖ్యాతగా వైదొలగడం బాధగా ఉంది. నేను సంసద్ టీవీలో ఒక కార్యక్రమం కోసం ఉండటానికి ఇష్టపడ్డాను. కానీ, ఏకపక్ష సస్పెన్షన్ కారణంగా పార్లమెంటు విధులను నిర్వర్తించడానికి నిరాకరించబడ్డాను. అందుకే నేను షోకు ఎంత నిబద్ధతతో ఉన్నప్పటికీ, నేను తప్పక తప్పుకుంటాను’ అని ట్వీట్ చేశారు. పార్లమెంటు నిబంధనల పేరుతో తనపై అన్యాయంగా వేటు వేశారని లేఖలో పేర్కొన్నారు.

అయితే గత సెషన్‌లో తప్పు చేసినందుకు 12 మంది సభ్యులను సెషన్ మొత్తం దాఖలు చేసినట్లు పార్లమెంటు చరిత్రలోనే లేదన్నారు. సంసద్ టీవీలో అవకాశం కల్పించినందుకు రాజ్యసభ చైర్మెన్, లోక్‌సభ స్పీకర్లకు ధన్యావాదాలు తెలిపారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన 12 మంది సభ్యుల్లో ప్రియాంకా ఒకరు కావడం గమనార్హాం. కాగా, ఈ సంసద్ టీవీ పార్లమెంటు ప్రసార వేదికగా ఉంది.

Tags:    

Similar News