షిర్డీ ఆలయం మూసివేత
కరోనా వైరస్ ప్రభావం తాజాగా దేవాలయాలపై పడింది. దేశంలోనే అత్యధిక రద్దీ ఉండే షిర్డీ దేవాలయం మూతపడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో భక్తులు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని షిర్డీ దేవస్థాన బోర్డు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులు షిర్డీకి రావొద్దని సూచించింది. కాగా, దేశంలో ఇప్పటివరకు 125పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో ప్రభావం తీవ్రంగా ఉంది. 39 కరోనా పాజిటివ్ […]
కరోనా వైరస్ ప్రభావం తాజాగా దేవాలయాలపై పడింది. దేశంలోనే అత్యధిక రద్దీ ఉండే షిర్డీ దేవాలయం మూతపడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో భక్తులు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని షిర్డీ దేవస్థాన బోర్డు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులు షిర్డీకి రావొద్దని సూచించింది. కాగా, దేశంలో ఇప్పటివరకు 125పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో ప్రభావం తీవ్రంగా ఉంది. 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: shirdi temple, closed, corona, maharashtra