మహిళాజట్టులో ఆమె మెరుపుతీగ
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు దూసుకెళ్తోంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్‌లో మట్టికరిపించిన భారత్ జట్టు రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను బొల్తా కొట్టించింది. దీంతో ఈ గ్రూప్‌లో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రెండు మ్యాచ్‌లలో షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన హైలేట్‌గా నిలిచింది. మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును షెఫాలీ ఉరకలెత్తించింది. క్రీజులో నిలిచింది కాసేపైనా భారీ షాట్లతో విరుచుకుపడి పరుగుల ప్రవాహం సృష్టించింది. చేసినవి తక్కువ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు దూసుకెళ్తోంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్‌లో మట్టికరిపించిన భారత్ జట్టు రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను బొల్తా కొట్టించింది. దీంతో ఈ గ్రూప్‌లో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ రెండు మ్యాచ్‌లలో షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన హైలేట్‌గా నిలిచింది. మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును షెఫాలీ ఉరకలెత్తించింది. క్రీజులో నిలిచింది కాసేపైనా భారీ షాట్లతో విరుచుకుపడి పరుగుల ప్రవాహం సృష్టించింది. చేసినవి తక్కువ పరుగులైనా.. సెహ్వాగ్ తరహా ఆటతీరుతో అభిమానులు, సీనియర్ల ప్రశంసలందుకుంది. భారత జట్టు అంటూ స్మృతి మందన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు మాత్రమే అనుకునే వారికి తానున్నానంటూ హెచ్చరికలు పంపింది.
కేవలం 16 ఏళ్లకే మెరిసిన ఈ మహిళా క్రికెట్ స్టార్.. ట్రోఫీని ముద్దాడే వరకు ఇదే దూకుడు కొనసాగిస్తానంటోంది. మెగాటోర్నీలో ఏ మాత్రం భయం బెరుకు లేకుండా భారీ షాట్లు ఆడటం షెఫాలీ ప్రత్యేకత. ఇదే ఆమెను జట్టులో ప్రత్యకంగా కనిపించేలా చేసింది. చిన్నది కావడంతో జట్టులో అందరికీ షెఫాలీ చేరువైంది. దీంతో అందరి ప్రోత్సాహమూ ఆమెకు ఉత్సాహాన్నందించింది. బోర్డు కూడా ఆమెకు అండగా నిలుస్తోంది.