‘రీయింబర్స్ మెంట్‌కు డబ్బులుండవు.. 'మేఘా' కు మాత్రం ఉంటాయి’

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రూ.38,500 కోట్ల నుంచి రూ. లక్ష 20 వేల కోట్లకు అమాంతం పెంచేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. ఒకవైపు .. ఉద్యోగుల జీతాలకు, రీయింబర్స్‌మెంట్‌కు, రైతు రుణమాఫీకి డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం […]

Update: 2021-08-05 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రూ.38,500 కోట్ల నుంచి రూ. లక్ష 20 వేల కోట్లకు అమాంతం పెంచేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. ఒకవైపు .. ఉద్యోగుల జీతాలకు, రీయింబర్స్‌మెంట్‌కు, రైతు రుణమాఫీకి డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ‘మేఘా’కు అప్పులు చేసి మరీ ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది దేశంలోనే అద్భుత పాలన అని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

Tags:    

Similar News