వార్న్ ఆల్‌టైం భారత జట్టు.. లక్ష్మణ్‌కు దక్కని చోటు !

కరోనా వైరస్ కారణంగా ఇండ్లకే పరిమితమైన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అనేక విషయాలపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ భారత ఆల్‌టైం అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. సౌరవ్ గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన వార్న్.. ఆసీస్‌పై అత్యుత్తమ రికార్డు ఉన్న వీవీఎస్‌ను మాత్రం జట్టులోకి తీసుకోలేదు. వీరేంద్ర సెహ్వాగ్, నవజోత్ సింగ్ సిద్ధును ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. మరో వైపు టీం ఇండియాకు […]

Update: 2020-04-02 05:54 GMT

కరోనా వైరస్ కారణంగా ఇండ్లకే పరిమితమైన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అనేక విషయాలపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ భారత ఆల్‌టైం అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. సౌరవ్ గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన వార్న్.. ఆసీస్‌పై అత్యుత్తమ రికార్డు ఉన్న వీవీఎస్‌ను మాత్రం జట్టులోకి తీసుకోలేదు. వీరేంద్ర సెహ్వాగ్, నవజోత్ సింగ్ సిద్ధును ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. మరో వైపు టీం ఇండియాకు అత్యద్భుత విజయాలందించిన ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సైతం ఈ జట్టులో చోటు లభించకపోవడం గమనార్హం. తన జట్టు ఎంపికపై పలు విమర్శలు రావడంతో.. దానికి వార్న్ తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నాడు.

నవజోత్ సింగ్ సిద్ధు స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడతాడనే విషయం ‘నేను కాదు.. ఎంతో మంది గొప్ప స్పిన్నర్లు చెప్పిన మాటే’ అని అన్నాడు. ఇక రాహుల్ ద్రావిడ్ గొప్ప ఆటగాడు.. నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అతడి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. నాలుగు, ఐదు, ఆరో స్థానాలను వరుసగా సచిన్, అజారుద్దీన్, గంగూలీలకు ఇచ్చాడు.

కాగా, ఆసీస్‌పై ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు ప్రశ్నించగా.. గంగూలీని కెప్టెన్‌గా ఉంచాలని నిర్ణయించా, అతను జట్టులో ఉంచాలంటే లక్ష్మణ్‌ను తప్పించక తప్పలేదని చెప్పుకొచ్చాడు.

వార్న్ జట్టు ఇదే:

వీరేంద్ర సెహ్వాగ్, నవజోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ (కెప్టెన్), కపిల్ దేవ్, హర్బజన్ సింగ్, నయన్ మోంగియా, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్.

Tags : Shane Warne, All time Indian team, Sourav Ganguly, VVS Laxman, Siddhu

Tags:    

Similar News