షకీబుల్, మోర్తాజాల కాంట్రాక్ట్ రద్దు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తన వార్షిక కాంట్రాక్ట్ నుంచి పలువురు సీనియర్ క్రికెటర్లకు ఉద్వాసన పలికింది. ఆదివారం జరిగిన బోర్డు మీటింగ్‌లో 16 మంది క్రికెటర్లకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించగా.. మష్రఫే మోర్తాజా, షకీబుల్ హసన్‌లను కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. కాగా ప్రస్తుత కాంట్రాక్టు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనుంది. వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా.. తాను రెగ్యులర్‌గా క్రికెట్‌కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బోర్డు మోర్తాజా కాంట్రాక్టును రద్దు చేసింది. […]
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తన వార్షిక కాంట్రాక్ట్ నుంచి పలువురు సీనియర్ క్రికెటర్లకు ఉద్వాసన పలికింది. ఆదివారం జరిగిన బోర్డు మీటింగ్‌లో 16 మంది క్రికెటర్లకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించగా.. మష్రఫే మోర్తాజా, షకీబుల్ హసన్‌లను కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. కాగా ప్రస్తుత కాంట్రాక్టు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనుంది.
వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా.. తాను రెగ్యులర్‌గా క్రికెట్‌కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బోర్డు మోర్తాజా కాంట్రాక్టును రద్దు చేసింది. ఇక షకీబుల్ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం ఉండటంతో కాంట్రాక్టు ఇవ్వలేదు. అతడిపై నిషేధం ఈ ఏడాది అక్టోబర్ 29న పూర్తవుతుంది. దీంతో అతను అక్టోబర్ 18 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. వీరిద్దరితో పాటు ఇమ్రుల్ కేస్, అబు హైదర్ రోనీ, సయ్యద్ ఖలీద్ అహ్మద్, రూబెల్ హుస్సేన్, షద్‌మన్ ఇస్లాంలకు కూడా కాంట్రాక్టు లభించలేదు.
tags:Bangladesh, central contract, ICC, Shakib Al hasan, Mortaza