కేసీఆర్.. మరిచిపోతున్నావా..? ఆ విషయం గుర్తొస్తలేదా?
దిశ, మహబూబ్ నగర్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలియజేస్తే విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మహబూబ్ నగర్ లో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో లక్షలాదిమంది విద్యార్థుల త్యాగాన్ని మరిచిపోవొద్దన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై కేసులు ఎలా […]
దిశ, మహబూబ్ నగర్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలియజేస్తే విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మహబూబ్ నగర్ లో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో లక్షలాదిమంది విద్యార్థుల త్యాగాన్ని మరిచిపోవొద్దన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా విద్యార్థులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఎన్ని లాఠీఛార్జీలు చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయమని, పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్, సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు ఈశ్వర్, సంజీవ్, శివ తదితరులు పాల్గొన్నారు.