కొవిడ్ టైమ్స్ హరాస్‌మెంట్స్.. పాండమిక్‌లో సెక్సువల్ అబ్యూస్
దిశ, ఫీచర్స్ : మహిళల రక్షణ కోసం ఎన్ని పటిష్ట చట్టాలు రూపొందించినా, ఎంతటి కఠిన శిక్షలు అమలు చేసినా.. ప్రతీరోజు దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. అధికారిక లెక్కలు కొన్నే అయినా.. ఫ్యామిలీ పరువు బజారున పడుతుందనో, సొసైటీ చిన్నచూపు చూస్తుందనో లేదంటే ఉద్యోగం ఊడుతుందనో కంప్లయింట్‌కు నోచుకోని ఘటనలకు లెక్కే లేదు. ఇక దేశాన్ని కదిలించిన సంఘటనలు ఒక నిర్భయ, మరొక దిశ.. ఇలా చెప్పుకుంటూ పోతే […]
దిశ, ఫీచర్స్ : మహిళల రక్షణ కోసం ఎన్ని పటిష్ట చట్టాలు రూపొందించినా, ఎంతటి కఠిన శిక్షలు అమలు చేసినా.. ప్రతీరోజు దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. అధికారిక లెక్కలు కొన్నే అయినా.. ఫ్యామిలీ పరువు బజారున పడుతుందనో, సొసైటీ చిన్నచూపు చూస్తుందనో లేదంటే ఉద్యోగం ఊడుతుందనో కంప్లయింట్‌కు నోచుకోని ఘటనలకు లెక్కే లేదు. ఇక దేశాన్ని కదిలించిన సంఘటనలు ఒక నిర్భయ, మరొక దిశ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతే ఉండదు. ఈ వేధింపుల పర్వం పాఠశాల స్థాయి నుంచే మొదలవుతుండగా.. కాలేజీలు, కార్యాలయాలు, మల్టీ నేషనల్ కంపెనీల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు ప్రతీ చోట మహిళలు సెక్సువల్ హరాస్‌మెంట్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది నాణేనికి ఒకవైపే కాగా, ఏడాది కాలంగా కొనసాగుతున్న పాండమిక్ పరిస్థితులు ఈ అంశంపై ఏ మేరకు ప్రభావం చూపాయనేది మరోవైపు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు తగ్గాయా? పెరిగాయా? ఒకవేళ పెరిగితే అందుకు దారితీసిన పరిస్థితులేంటి? వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఉమెన్ ఎంప్లాయిస్ ఏ విధంగా సెక్సువల్ అబ్యూస్‌కు గురవుతున్నారు? బాధితులు ఏమంటున్నారు? జస్ట్ రీడ్..
కొవిడ్-19 కారణంగా ఏడాది వ్యవధిలో ఎదుర్కొన్న రెండు లాక్‌డౌన్లు.. దాదాపు ప్రతీ ఒక్కరిని నాలుగు గోడలకే పరిమితం చేశాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మూతపడగా.. లక్షలాది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆన్‌లైన్ క్లాసులు, ఎంప్లాయీస్‌కు వర్చువల్ సోషల్ ఇంటరాక్షన్స్ తెరమీదకు వచ్చాయి. దీంతో పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులతో పాటు రేప్, ఇతరత్రా సెక్సువల్ హరాస్‌మెంట్స్ తగ్గుతాయనుకుంటే.. రియాలిటీ మాత్రం వేరేలా ఉంది. పాండమిక్ టైమ్స్‌లో జరుగుతున్న వర్చువల్ ఇంటరాక్షన్స్ వల్ల ఈ సమస్య పెరిగిందే తప్ప తగ్గలేదు. నిజం చెప్పాలంటే ఈ తరహా యాక్టివిటీస్‌కు పాల్పడే వారి పనిని ఆన్‌లైన్ మరింత ఈజీగా మార్చేసింది. పబ్లిక్ చూస్తారన్న భయం లేకపోవడం కూడా అందుకు కారణమైంది. ఈ నేపథ్యంలో హరాస్‌మెంట్‌కు గురైన పలువురు మహిళలు తమ అనుభవాలను పంచుకోగా.. చాలా సందర్భాల్లో బాధితురాలికి తెలిసిన వ్యక్తులే ఈ తరహా చర్యలకు పాల్పడటం గమనార్హం.
క్లాస్ రూమ్స్..
గత నెలలో తమిళనాడు, చెన్నై నగరంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రెస్టీజియస్ పద్మ శేషాద్రి బాల భవన్ (పీఎస్‌బీబీ) స్కూల్‌లో కామర్స్ టీచర్‌గా పనిచేస్తున్న రాజగోపాల్(59) సెక్సువల్ మిస్‌కండక్ట్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తను టవల్ ధరించి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవడంతో పాటు గర్ల్ స్టూడెంట్స్‌కు అసంబద్ధ కంటెంట్‌ను డెలివరీ చేయడంతో అరెస్టు చేసిన పోలీసులు.. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఇన్సిడెంట్‌తో మేల్కొన్న తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్.. ఆన్‌లైన్ క్లాసులపై తగిన గైడ్‌లైన్స్ రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. టీచర్ల ప్రవర్తనకు సంబంధించి రాండమ్ ఆడిటింగ్, మానిటరింగ్ సహా విద్యార్థులకు, ఫ్యాకల్టీకి సంబంధించి డ్రెస్ కోడ్‌ను సజెస్ట్ చేసింది. కాగా ఇలాంటి కేసులు ఒక్క తమిళనాడులోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ నమోదయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల విద్యార్థి.. ఆన్‌లైన్ కోడింగ్ క్లాస్‌లో ఎంటరై, ఉమెన్ ఇన్‌స్ట్రక్టర్‌కు బాడీని ఎక్స్‌పోజ్ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే, మరో సంఘటనలో ఒక టీచర్ ఆన్‌లైన్ క్లాసుల సందర్భంగా అర్ధనగ్నంగా కనిపించింది..
ఆఫీసులు..
ఎక్కువ మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ.. వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రం తగ్గలేదు. ప్రముఖ కంపెనీకి చెందిన ఉద్యోగి.. ఫిమేల్ మేనేజర్‌తో వర్చువల్ మీటింగ్ సందర్భంగా షర్ట్‌లెస్‌గా దర్శనమిచ్చాడు. ఇంకో ఇన్సిడెంట్‌లో.. మరొక మేల్ ఎంప్లాయీ.. రాత్రి 11 గంటలకు మీటింగ్ జరుగుతుండగా సహోద్యోగిణి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పటికీ, వీడియో ఆన్ చేయమని పట్టుబట్టాడు. ఇక కొన్ని వెబ్‌సైట్లు పేషెంట్లకు డాక్టర్లతో వర్చువల్ కన్సల్టేషన్స్ నిర్వహిస్తుండగా.. మహిళా డాక్టర్లను లైంగికంగా ఇబ్బంది పెట్టడం ఈజీ అయిపోయింది. అసభ్యకరమైన కామెంట్స్ వదలడం, హస్తప్రయోగం చేయడం లేదా కన్సల్టేషన్ పర్మిషన్ పేరుతో పోర్న్ క్లిప్పింగ్స్ పంపడం వంటివి చేస్తున్నారు.
ఉమెన్ పొలిటీషియన్స్, యాక్ట్రెసెస్..
భారతదేశంలోని మహిళా రాజకీయ నాయకులు ఆన్‌లైన్‌లో లింగ వివక్ష వేధింపులను ఎదుర్కొంటున్నట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికను విడుదల చేసింది. యూకే లేదా యూఎస్‌తో పోలిస్తే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ. అత్యంత దురుసుగా ఉండే ట్రోలింగ్‌లో 55% ముస్లిం మహిళా నాయకులను ఉద్దేశించింది.
‘నా చర్మం రంగు, లుక్స్ గురించి ఎక్కువ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటాను. నిన్ను రేప్ చేయడం కూడా దండగ అనే కామెంట్స్ చేస్తూ నన్ను ఎలాంటి హింసకు, అత్యాచారానికి గురిచేస్తారో చెప్తూ భయపెడుతుంటారు. నువ్వు ఎలాంటి పురుషులతో పడుకుంటావో చెప్పమంటూ వేధిస్తారు’ అని అఖిల భారత ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ కార్యదర్శి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లిబరేషన్ సభ్యురాలు కవితా కృష్ణన్ వెల్లడించారు. కాగా హీరోయిన్ మీరా చోప్రాను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై పలువురు బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఇష్యూకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ జూన్ 17న ట్విట్టర్ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేసింది. అభిమానులతో ఆన్‌లైన్ చిట్ చాట్ సందర్భంగా అబ్యూస్‌మెంట్‌కు గురికాగా, మీరా వారిపై కేసు నమోదు చేసింది.
సర్వే..
అమెరికన్ సోషల్ మీడియా కంపెనీ ‘బంబుల్’ ఇటీవల నిర్వహించిన నేషనల్ వైడ్ సర్వే ప్రకారం.. ఇండియాలోని 83 శాతం మహిళలు ఏదో ఒక రూపంలో ఆన్‌లైన్ వేధింపులు చవిచూశారని, ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ వారానికోసారి ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటుందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న 60శాతం ఉమెన్.. తాము సేఫ్‌గా ఉన్నట్లు భావించడం లేదని చెప్పగా, 48 శాతం మహిళలు ఈ విషయం పట్ల కోపాన్ని ప్రదర్శించినట్టు వెల్లడించింది. నేషన్‌వైడ్ లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి సైబర్ బుల్లీయింగ్ పెరిగిందని 70శాతం మహిళలు విశ్వసిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఆన్‌లైన్‌లో వ్యవహరించే విధానం నేర్పించాలి..
పాండమిక్ వ్యాపించినప్పటి నుంచి ఆన్‌లైన్‌లో మహిళలపై వేధింపుల కేసులు ఐదు రెట్లు పెరిగాయి. కొవిడ్‌కు ముందు ఆన్‌లైన్ హరాస్‌మెంట్స్‌కు సంబంధించి 300 కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1500కు చేరింది. ఆన్‌లైన్‌లో పనిచేసేటపుడు వ్యవహరించాల్సిన తీరుపై బోధించాల్సిన అవసరం ఉంది. – రేఖా శర్మ, చైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్త (NCW)