మరోసారి భారీ నష్టాల్లో మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. గత వారం కీలక 50 వేల మార్కును తాకిన తర్వాత వరుసగా నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు బుధవారం మరింత దారుణంగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల్లో లాభాల స్వీకరణ పెరిగింది. దీంతో సెన్సెక్స్ ఇండెక్స్ గత కొన్నాళ్లుగా సాధించిన రికార్డులు క్షీణించి 48 వేల మార్కు దిగువకు చేరుకుంది. అంతేకాకుండా ప్రభుత్వం రంగ సంస్థల […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. గత వారం కీలక 50 వేల మార్కును తాకిన తర్వాత వరుసగా నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు బుధవారం మరింత దారుణంగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల్లో లాభాల స్వీకరణ పెరిగింది. దీంతో సెన్సెక్స్ ఇండెక్స్ గత కొన్నాళ్లుగా సాధించిన రికార్డులు క్షీణించి 48 వేల మార్కు దిగువకు చేరుకుంది. అంతేకాకుండా ప్రభుత్వం రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకునే కీలక నిర్ణయంపై అంచనాలతో చమురు, బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగారని, దీని కారణంగానే మార్కెట్ల పతనమవుతున్నాయని మార్కెట్ విశ్లెషకులు భావిస్తున్నారు.
రికార్డు స్థాయిలోకి మార్కెట్లు ర్యాలీ చేసే క్రమంలో లాభాల స్వీకరణ మార్కెట్లకు ఆరోగ్యకరమని విశ్లేషకులు తెలిపారు. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 937.66 పాయింట్లు కోల్పోయి 47,409 వద్ద ముగిసింది. నిఫ్టీ 271.40 పాయింట్లు నష్టపోయి 13,967 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, భారీగా కుప్పకూలగా, ఫార్మా, మెటల్, ఆటో రంగాలు అమ్మకాల ఒత్తిడితో డీలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్, నెస్లె ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డా రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్, ఎంఅండ్ఎం షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.93 వద్ద ఉంది.