చివర్లో డీలాపడ్డ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: చివరి గంటలో అమ్మకాల ధాటికి దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావానికి తోడు, దేశీయంగా భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణాలతోనే దేశీయ మార్కెట్లు (Domestic markets) ఒడుదుడుకులకు గురై నష్టాల్లో కదలాడాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిడ్ సెషన్‌ (Mid session)కు ముందు కొంత బలపడినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మార్కెట్లకు రుచించలేదని […]

Update: 2020-09-08 06:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: చివరి గంటలో అమ్మకాల ధాటికి దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావానికి తోడు, దేశీయంగా భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణాలతోనే దేశీయ మార్కెట్లు (Domestic markets) ఒడుదుడుకులకు గురై నష్టాల్లో కదలాడాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మిడ్ సెషన్‌ (Mid session)కు ముందు కొంత బలపడినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మార్కెట్లకు రుచించలేదని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 51.88 పాయింట్లను కోల్పోయి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 37,70 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ రంగం (IT sector) మాత్రమే బలపడగా, మిగిలిన రంగాలన్నీ నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకి, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.91 వద్ద ఉంది.

Tags:    

Similar News