భారీగా లాభపడిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: ఒకవైపు అంతర్జాతీయంగా అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పరిణామాలతో అమెరికా షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. ఈ పరిణామాలకు తోడు దేశీయంగా రెండోసారి ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారనే సంకేతాలతో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్లు అధిక […]

Update: 2020-04-16 23:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకవైపు అంతర్జాతీయంగా అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పరిణామాలతో అమెరికా షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. ఈ పరిణామాలకు తోడు దేశీయంగా రెండోసారి ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారనే సంకేతాలతో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్లు అధిక లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.20 గంటల సమయంలో సెన్సెక్స్ 740.97 పాయింట్ల లాభంతో 31,343 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 206.65 పాయింట్లు లాభపడి 9,199 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇడెక్స్‌లో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగం షేర్లు కొంత బలహీనపడటం గమనార్హం. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఎఫ్ఎమ్‌సీజీ రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్న్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News