Rupay Credit card: రూపే క్రెడిట్‌ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఎయిర్‌పోర్టుల్లో ఉచితంగా లాంజ్‌ యాక్సెస్‌..!

రూపే కార్డు(Rupay card)ల వినియోగం ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-10-27 07:22 GMT

దిశ, వెబ్ డెస్క్: రూపే కార్డు(Rupay card)ల వినియోగం ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీఐ(UPI)లో రూపే క్రెడిట్‌ కార్డు(Rupay Credit card)లను యాడ్ చేసుకునే అవకాశం లభించడంతో వీటిని ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న యూజర్ల కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కార్డులు వాడేవారు ఇక నుంచి దేశంలో ఉన్న పలు విమానాశ్రయాలలో(Airports) ఉన్న లాంజ్(Lounge)లలో ప్రత్యేక సౌకర్యాలు పొందొచ్చని పేర్కొంది. తాజాగా ఢిల్లీ(Delhi)లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(Indira Gandhi International Airport)లోని టెర్మినల్‌-3(Terminal-3)లో రూపే తొలి ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని బోర్డింగ్ గేట్ నంబర్ 41(Boarding Gate No. 41) వద్ద డిపార్చర్ పీర్ 11(Departure Pier 11), టీ3డీ(T3D) దగ్గర ప్రారంభించింది. ఈ కార్డుతో అనేక రకాల ఆహారం, డ్రింక్స్‌, వినోదాలు వంటి వాటిని పొందొచ్చని NPCI తెలిపింది.

అయితే కొత్త గైడ్ లైన్స్ ప్రకారం రూపే క్రెడిట్ కార్డును యూజర్లు వినియోగించే విధానం ఆధారంగా లాంజ్‌ యాక్సెస్‌(Lounge Access) ఉంటుందని వెల్లడించింది. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్‌ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ. 1,00,000 వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత లాంజ్ యాక్సెస్‌ ఉంటుంది. ఇక రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8 సార్లు, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అన్ లిమిటెడ్ లాంజ్ యాక్సెస్(Unlimited Lounge Access) లభిస్తుంది. ఈ కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags:    

Similar News