Intel: 2005లో ఎన్‌విడియాను కొనుగోలు చేసే ఛాన్స్.. చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకున్న ఇంటెల్
అమెరికాకు చెందిన ఏఐ చిప్(AI Chip)ల తయారీ కంపెనీ ఎన్‌విడియా(Nvidia) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)కు చెందిన ఏఐ చిప్(AI Chip)ల తయారీ కంపెనీ ఎన్‌విడియా(Nvidia) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్(Apple)ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. త్వరలో ఏఐ సూపర్ కంప్యూర్స్ చిప్స్(AI Supercomputers Chips) తీసుకురానుందన్న వార్తలతో కంపెనీ షేర్ విలువ 18శాతం పెరిగింది. దీంతో స్టాక్ మార్కెట్‌లో ఎన్‌విడియా షేర్ల విలువ 3.53 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఏదైనా బిజినెస్ ను విజయవంతంగా నడపాలంటే డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ సామర్థ్యం లేకుంటే కంపెనీకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్స్ చిప్స్(Electronics chips) తయారీ కంపెనీ ఇంటెల్(Intel)కు 2005లో భారీ తప్పిదం చేసింది. రూ. 2000 కోట్లతో ఎన్‌విడియా కంపెనీని కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సంస్థ సామర్థ్యాన్ని ఇంటెల్ సరిగ్గా అంచనా వేయక ఆ డీల్ ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడదే ఎన్‌విడియా కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 3.53 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంటెల్ మార్కెట్ విలువ రూ. 10,000 కోట్లకు పడిపోయింది. ఏఐ చిప్ తయారీలో వెనకబడి, ఏఐ లో కాస్ట్ చిప్ Gaudi 3ని తీసుకొచ్చినా ఏం లాభం లేకుండాపోయింది.