ITR Filing: ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించిన ఐటీ శాఖ

దీపావళి పండగ(Diwali Festival)కు ముందు కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్(Corporate Tax Payers)కి ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-27 08:08 GMT

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండగ(Diwali Festival)కు ముందు కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్(Corporate Tax Payers)కి ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి (2024-25 Assessment Year) సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్(ITR Filing) గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT)  సర్క్యులర్ జారీ చేసింది. ఈ  విషయాన్ని ఐటీ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో 'ఎక్స్(X)'లో పోస్ట్ చేసింది. కాగా ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్ 31, 2024తో ముగియనుంది. అయితే ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐటీ రిటర్నుల దాఖలు ఆలస్యమవుతోందన్న ఫిర్యాదుల మేరకు సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో 15 రోజుల పాటు కార్పొరేట్లు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆదాయపు పన్ను చట్టం, 1961(Income Tax Act, 1961)లోని సెక్షన్ 139(section 139)లోని సబ్-సెక్షన్ (1) కింద కవర్ చేయబడిన పన్ను చెల్లింపుదారులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News