వారాంతం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకిన తర్వాత వారాంతంలో నష్టపోయాయి. శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైనా, చివరివరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు తక్కువ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా మెటల్, టెలికాం, రియల్టీ, ఫ్యుయెల్ రంగాల్లో మెరుగైన కొనుగోళ్లు జరిగినప్పటికీ, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయని విశ్లేషకులు తెలిపారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకిన తర్వాత వారాంతంలో నష్టపోయాయి. శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైనా, చివరివరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు తక్కువ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా మెటల్, టెలికాం, రియల్టీ, ఫ్యుయెల్ రంగాల్లో మెరుగైన కొనుగోళ్లు జరిగినప్పటికీ, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయని విశ్లేషకులు తెలిపారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 0.80 శాతం నష్టపోయి 15,923 వద్ద ముగిసింది.
నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ కుదేలవగా, మెటల్, ఫార్మా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.60 వద్ద ఉంది.