లాభాల్లో మార్కెట్లు..ఎస్‌బీఐ కార్డు, సేవల షేర్ ధర నిర్ణయం!
దిశ, వెబ్‌డెస్క్ : కీలక సంస్థల షేర్లు పుంజుకోవడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. సోమవారం భారీ నష్టాల తర్వాత మంగళవారం మార్కెట్లు స్వల్పంగా లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లలో సూచీల కదలికలు మిశ్రమంగా నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 104.48 పాయింట్ల లాభంతో 40,467 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30.25 పాయింట్లు లాభపడి 11,859 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సన్‌ఫార్మా, […]
దిశ, వెబ్‌డెస్క్ : కీలక సంస్థల షేర్లు పుంజుకోవడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. సోమవారం భారీ నష్టాల తర్వాత మంగళవారం మార్కెట్లు స్వల్పంగా లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లలో సూచీల కదలికలు మిశ్రమంగా నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 104.48 పాయింట్ల లాభంతో 40,467 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30.25 పాయింట్లు లాభపడి 11,859 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.76 వద్ద కొనసాగుతోంది.
అన్ని రంగాల సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఎఫ్ఎమ్‌సీజీ 1.35 శాతంతో 415 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా నిన్నటి సెషన్‌లో అధిక నష్టాలను మూటగట్టుకున్న మెటల్ ఇండెక్స్‌లో కూడా జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంతా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇండియా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డుల, చెల్లుంపు సేవల ఐపీవోకు సంబంధించి షేర్ ధరను రూ. 750 నుంచి రూ. 755 మధ్య నిర్ణయించనున్నట్టు ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డుల ఐపీవో మార్చి 2 ప్రారంభం కానుంది. బిడ్డింగ్ ప్రక్రియ మార్చి 5న ముగుస్తుంది. ఐపీవో సుమారు రూ. 9000 కోట్లు వసూలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.