లాభాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు..

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం సానుకూలంగా మొదలైనప్పటికీ మధ్యలో కొంచెం తడబడ్డాయి. అనంతరం కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో ఇంట్రాడే గరిష్ఠాల వద్ద మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు మెరుగ్గా ర్యాలీ చేశాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ […]

Update: 2021-07-23 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం సానుకూలంగా మొదలైనప్పటికీ మధ్యలో కొంచెం తడబడ్డాయి. అనంతరం కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో ఇంట్రాడే గరిష్ఠాల వద్ద మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు మెరుగ్గా ర్యాలీ చేశాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ ఐపీఓలో దూసుకెళ్లడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాలను దక్కించుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 138.59 పాయింట్లు ఎగసి 52,975 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 15,856 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ 1 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. ఆటో, మీడియా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు అధిక లాభాలను సాధించగా, ఎల్అండ్‌టీ, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.43 వద్ద ఉంది.

Tags:    

Similar News