వరుసగా రెండోరోజూ నష్టపోయిన సూచీలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టపోయాయి. మిడ్-సెషన్‌లో కోలుకుంటున్న సంకేతాలు ఇచ్చినప్పటికీ తర్వాత నెమ్మదించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా కీలక కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు క్షీణించాయి. దేశీయంగా బలహీమైన పరిణామాలతో స్టాక్ మార్కెట్లకు మద్దతు కరువైందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 314.04 పాయింట్లు కోల్పోయి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టపోయాయి. మిడ్-సెషన్‌లో కోలుకుంటున్న సంకేతాలు ఇచ్చినప్పటికీ తర్వాత నెమ్మదించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా కీలక కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు క్షీణించాయి. దేశీయంగా బలహీమైన పరిణామాలతో స్టాక్ మార్కెట్లకు మద్దతు కరువైందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 314.04 పాయింట్లు కోల్పోయి 60,008 వద్ద, నిఫ్టీ 100.55 పాయింట్లు పతనమై 17,898 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ 1.6 శాతం దిగజారింది. ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, డా రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.27 వద్ద ఉంది.