జోరు పెంచిన మార్కెట్లు.. రూపాయి కూడా!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కోసం ప్రయోగాత్మకంగా రెమెడిసివిర్ ఔషధానికి సానుకూలంగా ఫలితాలు రావడంతో కీలక సూచీలు ఉదయం నుంచే లాభాల్లో కదలాడాయి. మధ్యాహ్నం లంచ్ సమాయానికి సెన్సెక్స్ అధికంగా 1135 పాయింట్లు లాభపడి 33,855 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 329.75 పాయింట్ల లాభంతో 9,883 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాలు లాభాల్లో ట్రేడవుతుండగా సెన్సెక్స్ కొంత గ్యాప్ తర్వాత 33 వేల మార్కును దాటింది. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా రంగాల షేర్లు భారీగా లాభపడుతున్నాయి. […]

Update: 2020-04-30 02:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కోసం ప్రయోగాత్మకంగా రెమెడిసివిర్ ఔషధానికి సానుకూలంగా ఫలితాలు రావడంతో కీలక సూచీలు ఉదయం నుంచే లాభాల్లో కదలాడాయి. మధ్యాహ్నం లంచ్ సమాయానికి సెన్సెక్స్ అధికంగా 1135 పాయింట్లు లాభపడి 33,855 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 329.75 పాయింట్ల లాభంతో 9,883 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాలు లాభాల్లో ట్రేడవుతుండగా సెన్సెక్స్ కొంత గ్యాప్ తర్వాత 33 వేల మార్కును దాటింది. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా రంగాల షేర్లు భారీగా లాభపడుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు 700 పాయింట్లు ఎగిసి 21,500 స్థాయిని దాటింది.

రూపాయి కూడా..

ఇక, దేశీయ గురువారం వరుసగా నాలుగో రోజూ భారీగా పెరిగింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 63 పైసలు పెరిగి రూ. 75.03 వద్ద ఉంది. దేసీయ ఈక్విటీ మార్కెట్ల లాభాలు, విదేశీ ఫండ్‌ల ప్రావాహం వంటి సానుకూలంగా ఉండటంతో రూపాయికి కలిసొచ్చిందని ఫారెక్స్ నిపుణులు పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 722.08 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. దీనికితోడు, మే 4 నుంచి ఇండియాలోని అనేక రంగాల్లో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యే సూచనలు ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడిందని మార్కెట్లు వర్గాలు భావిస్తున్నాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market, rupee, rupee vs dollar

Tags:    

Similar News