మార్కెట్లలో జియో-ఫేస్‌బుక్ జోష్!

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లకు హుషారు వచ్చింది. మంగళవారం చమురు ధరల మైనస్ పతనంతో కుదేలైన మార్కెట్లకు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పెట్టుబడులు పెట్టనుందనే సమాచారంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఉదయం 200 పాయింట్ల లాభంతో జోరుగా మొదలైన మార్కెట్లు తర్వాత కూడా అదే జోరును కొనసాగించాయి. జియో-ఫేస్‌బుక్ ఒప్పందం మార్కెట్ వర్గాల్లో సానుకూల సంకేతాలను ఇచ్చింది. దీంతో రిలయన్స్ షేర్ ధర 10 శాతానికిపైగా పెరిగింది. ముగిసే వరకూ అదే […]

Update: 2020-04-22 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లకు హుషారు వచ్చింది. మంగళవారం చమురు ధరల మైనస్ పతనంతో కుదేలైన మార్కెట్లకు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పెట్టుబడులు పెట్టనుందనే సమాచారంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఉదయం 200 పాయింట్ల లాభంతో జోరుగా మొదలైన మార్కెట్లు తర్వాత కూడా అదే జోరును కొనసాగించాయి. జియో-ఫేస్‌బుక్ ఒప్పందం మార్కెట్ వర్గాల్లో సానుకూల సంకేతాలను ఇచ్చింది. దీంతో రిలయన్స్ షేర్ ధర 10 శాతానికిపైగా పెరిగింది. ముగిసే వరకూ అదే ఉత్సాహంతో మార్కెట్లు క్లోజయ్యాయి. సెన్సెక్స్ 742.84 పాయింట్ల లాభంతో 31,379 వద్ద క్లోజయింది. నిఫ్టీ 205.85 పాయింట్లు ఎగిసి 9,187 వద్ద క్లోజయింది. చమురు ధరల పతనం కారణంగా 9 వేల దిగువన జారిన నిఫ్టీ మళ్లీ పుంజుకుంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 76.67 వద్ద ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అత్యధికంగా రిలయన్స్ 10.30 శాతం లాభపడగా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతీ సుజుకీ, నెస్లె ఇండియా షేర్లు లాభపడగా, ఓన్‌జీసీ, ఎల్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడయ్యాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News