మార్కెట్లకు చమురు సెగ!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా క్రూడాయిల్ సంక్షోభం కారణంగా దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఉదయం కాస్త నిలకడగా కదిలినప్పటికీ లంచ్ తర్వాత అధిక నష్టాలు నమోదవడంతో సెన్సెక్స్ అత్యధికంగా వెయ్యి పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1011.29 పాయింట్లను నష్టపోయి 30,636 వద్ద క్లోజయింది. నిఫ్టీ 280.40 పాయింట్లు కోల్పోయి 8,981 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే చివరి గంటలో షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీలో ప్రధానంగా ఫార్మా రంగం మినహా అన్ని […]

Update: 2020-04-21 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా క్రూడాయిల్ సంక్షోభం కారణంగా దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఉదయం కాస్త నిలకడగా కదిలినప్పటికీ లంచ్ తర్వాత అధిక నష్టాలు నమోదవడంతో సెన్సెక్స్ అత్యధికంగా వెయ్యి పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1011.29 పాయింట్లను నష్టపోయి 30,636 వద్ద క్లోజయింది. నిఫ్టీ 280.40 పాయింట్లు కోల్పోయి 8,981 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే చివరి గంటలో షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీలో ప్రధానంగా ఫార్మా రంగం మినహా అన్ని రంగాలు నష్టాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ అత్యధికంగా 12.30 శాతం నష్టాలను చూసింది. బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు షేర్లు అధిక నష్టాల్లో ట్రేడవ్వగా, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, నెస్లె ఇండియా మాత్రమే లాభాల్లో ముగిశాయి. యూఎస్ డాలరు మారకంతో రూపాయి 29 పైసలు క్షీణించి రూ. 76.83 వద్ద ట్రేడయింది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News