ఒడిదుడుకుల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య కదలాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్ప లాభంతోనూ, నిఫ్టీ స్వల్ప నష్టంతోనూ ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు, కొవిడ్-19 ప్రభావంతో మదుపర్లు ఆచితూచీ వ్యవహరించారు. సెన్సెక్స్ 59.28 పాయింట్ల లాభంతో 31,648 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 4.90 పాయింట్లు కోల్పోయి 9,261 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఎనర్జీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభపడగా, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, ఆటో రంగాల షేర్లు అమ్మకాల […]

Update: 2020-04-20 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య కదలాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్ప లాభంతోనూ, నిఫ్టీ స్వల్ప నష్టంతోనూ ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు, కొవిడ్-19 ప్రభావంతో మదుపర్లు ఆచితూచీ వ్యవహరించారు. సెన్సెక్స్ 59.28 పాయింట్ల లాభంతో 31,648 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 4.90 పాయింట్లు కోల్పోయి 9,261 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఎనర్జీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభపడగా, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆసక్తికరంగా త్రైమాసిక ఫలితాల ప్రకటన ఉన్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.53 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News