మార్కెట్ల లాభాలకు బ్రేక్!

దిశ, వెబ్‌డెస్క్: వరుస లాభాలను చూసిన మార్కెట్లు వారాంతంలో నష్టపోయాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల తీరు దేశీయంగా ప్రభావం చూపించడంతో పాటు, కొవిడ్-19 వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కృంగిపోయిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి లోనయ్యారు. అంతేకాకుండా, మార్కెట్లో లిక్విడితీ కొరత, మదుపర్ల నుంచి రిడెంప్షన్‌కు పెరిగిన ఒత్తిళ్ల వల్ల 6 డెట్ పథకాలను నిలిపేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రకటించడంతో బ్యాంకులకు, ఏఎమ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ, లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు అమ్మకాలు అత్యధికంగా పెరిగాయి. వీటికితోడు, కరోనా వైరస్‌ను నిలువరించేందుకు […]

Update: 2020-04-24 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస లాభాలను చూసిన మార్కెట్లు వారాంతంలో నష్టపోయాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల తీరు దేశీయంగా ప్రభావం చూపించడంతో పాటు, కొవిడ్-19 వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కృంగిపోయిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి లోనయ్యారు. అంతేకాకుండా, మార్కెట్లో లిక్విడితీ కొరత, మదుపర్ల నుంచి రిడెంప్షన్‌కు పెరిగిన ఒత్తిళ్ల వల్ల 6 డెట్ పథకాలను నిలిపేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రకటించడంతో బ్యాంకులకు, ఏఎమ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ, లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు అమ్మకాలు అత్యధికంగా పెరిగాయి.

వీటికితోడు, కరోనా వైరస్‌ను నిలువరించేందుకు డ్రగ్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడయ్యాయి. ముఖ్యంగా కేపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ మినహాయించి మిగిలిన అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనబడింది. అధికంగా బ్యాంకింగ్ రంగం నష్టపోవడంతో పాటు, టెక్నాలజీ, ఐటీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 535.86 పాయింట్లు నష్టపోయి 31,327 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 159.50 పాయింట్లు నష్టపోయి 9,154 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్, ఎల్‌టీ సూచీలు లాభాల్లో కదలాడగా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.45 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News