లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు నెలకొనడంతో సూచీలన్నీ కీలకమైన మద్దతుతో పటిష్టంగా కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉండటంతో లాభాలతో మార్కెట్లు ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీతో సహా అన్ని రంగాల షేర్లు లాభాలనే నమోదు చేశాయి. సెన్సెక్స్ 483.53 పాయింట్ల లాభంతో 31,863 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 126.60 పాయింట్లు లాభపడి 9,313 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్ర, టీసీఎస్ ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్, […]

Update: 2020-04-23 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు నెలకొనడంతో సూచీలన్నీ కీలకమైన మద్దతుతో పటిష్టంగా కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉండటంతో లాభాలతో మార్కెట్లు ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీతో సహా అన్ని రంగాల షేర్లు లాభాలనే నమోదు చేశాయి. సెన్సెక్స్ 483.53 పాయింట్ల లాభంతో 31,863 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 126.60 పాయింట్లు లాభపడి 9,313 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్ర, టీసీఎస్ ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడగా, టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎల్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్తాల్లో ట్రేడయ్యాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారంతో పోలిస్తే గురువారం స్వల్పంగా బలపడి రూ. 76.20 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News