దూసుకెళ్తున్న మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఎనిమిదవ రోజూ లాభాలతోనే ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి ఫలితాలు మెరుగ్గా ఉండటంతో సూచీలు ర్యాలీ చేశాయి. మంగళవారం సరికొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు, బుధవారం ప్రారంభం తర్వాత కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ఫార్మా, ఐటీ షేర్ల అండతో మళ్లీ పుంజుకున్నాయి. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు మధ్యంతర ట్రయల్ ఫలితాలు రావడంతో మార్కెట్లు […]

Update: 2020-11-11 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఎనిమిదవ రోజూ లాభాలతోనే ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి ఫలితాలు మెరుగ్గా ఉండటంతో సూచీలు ర్యాలీ చేశాయి. మంగళవారం సరికొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు, బుధవారం ప్రారంభం తర్వాత కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ఫార్మా, ఐటీ షేర్ల అండతో మళ్లీ పుంజుకున్నాయి. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు మధ్యంతర ట్రయల్ ఫలితాలు రావడంతో మార్కెట్లు రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 316.02 పాయింట్లు ఎగసి 43,593 వద్ద ముగియగా, నిఫ్టీ 118.05 పాయింట్లు లాభపడి 12,749 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫార్మా రంగం 3 శాతానికి పైగా పుంజుకోగా, ఐటీ, మెటల్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీడియా రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నీరసించగా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆల్ట్రా సిమెంట్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.38 వద్ద ఉంది.

Tags:    

Similar News