CM Revanth: ఇందిర మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు

ఉద్యమకారుడు, తెలంగాణ వైతాళికుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్(Professor Keshava Rao Jadav) సతీమణి ఇందిర(Indira) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం తెలిపారు.

Update: 2025-01-04 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యమకారుడు, తెలంగాణ వైతాళికుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్(Professor Keshava Rao Jadav) సతీమణి ఇందిర(Indira) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరులో, హక్కుల ఉద్యమాల్లో జాదవ్‌కు అన్ని రకాలుగా తోడుగా నడిచిన ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని అన్నారు. 2018లో జాదవ్‌ను ఇప్పుడు వారి సతీమణి ఇందిరని కోల్పోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. జాదవ్-ఇందిరమ్మ ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబీకులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.


Tags:    

Similar News