సూచీలెత్తేసిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లపై కరోనా కక్ష కట్టింది. అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాల మార్కెట్లు నష్టాలనే నమోదుచేశాయి. మంగళవారం నాటి భారీ నష్టాలను అధిగమించి బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు గంట తర్వాత నుంచి దిగజారాయి. కాసేపు ఊగిసలాడినప్పటికీ చివరికీ భారీ నష్టాలతో క్లోజయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1709.58 పాయింట్ల నష్టంతో 28,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 498.25 పాయింట్లను కోల్పోయి 8,468 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీలో ఐటీసీ, ఓఎన్‌జీసీ, […]

Update: 2020-03-18 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లపై కరోనా కక్ష కట్టింది. అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాల మార్కెట్లు నష్టాలనే నమోదుచేశాయి. మంగళవారం నాటి భారీ నష్టాలను అధిగమించి బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు గంట తర్వాత నుంచి దిగజారాయి. కాసేపు ఊగిసలాడినప్పటికీ చివరికీ భారీ నష్టాలతో క్లోజయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1709.58 పాయింట్ల నష్టంతో 28,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 498.25 పాయింట్లను కోల్పోయి 8,468 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీలో ఐటీసీ, ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు లాభపడగా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు ప్రతికూలంగా ముగించాయి. ఓఎన్‌జీసీ, ఐటీసీ షెర్లు మాత్రమే సానుకూలంగా ముగిశాయి.

వరుస నష్టాల కారణంగా నిఫ్టీ మూడేళ్ల కనిష్ఠానికి దిగజారింది. బ్యాంకింగ్ రంగం బాగా క్షీణించడంతో నిఫ్టీ బ్యాంకు 2017 తర్వాత 21 వేల దిగువకు పడిపోయింది. సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి 8,850 మార్కు బలమైన పాయింట్‌గా భావిస్తారు. అయితే, నిఫ్టీ ఇంకా కిందికే దిగజారడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలుకు సంబంధించి చివరి పావు గంట సమయంలో ప్రకటన రావడంతో మరింత నష్టం ఏర్పడకుండా సూచీలు కోలుకోవడం గమనార్హం.

ఏజీఆర్ చెల్లింపుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం టెలికాం సంస్థలకు మరోసారి చురక అంటించింది. స్వీయ మదింపు ఎవరు చేసుకోమన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీల షేర్లు, ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లు భారీగా నష్టాలను నమోదు చేశాయి. వీటికి తోడు, ఇండియా మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువమొత్తం ఉపసంహరించుకున్నారు. ఈ ఒక్క నెలలోనే రూ. 38 వేల కోట్లకుపైగా వాటాలను విక్రయించడం జరిగింది. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

tags : sensex, nifty, BSE, NSE, stock market, agr dues, supreme court

Tags:    

Similar News