భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గత కొన్ని సెషన్లుగా రికార్డు లాభాలను సాధిస్తున్న సూచీలు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అత్యధిక పాయింట్ల నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1.6 శాతంతో వెయ్యి పాయింట్లకు పైగా ఇంట్రా డే కనిష్ఠాలను చూసింది. అయితే, ఆ తర్వాత పెట్టుబడిదారులు తిరిగి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో కోలుకున్నాయి. ఇటీవల భారీ లాభాల్లో ర్యాలీ చేస్తున్న స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. […]

Update: 2021-09-28 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గత కొన్ని సెషన్లుగా రికార్డు లాభాలను సాధిస్తున్న సూచీలు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అత్యధిక పాయింట్ల నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1.6 శాతంతో వెయ్యి పాయింట్లకు పైగా ఇంట్రా డే కనిష్ఠాలను చూసింది. అయితే, ఆ తర్వాత పెట్టుబడిదారులు తిరిగి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో కోలుకున్నాయి. ఇటీవల భారీ లాభాల్లో ర్యాలీ చేస్తున్న స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో మొదలైనప్పటికీ మిడ్-సెషన్ సమయానికి అధిక నష్టాలను చూశాయి. చివర్లో కొంత కోలుకుని నష్టాలను తగ్గించగలిగాయి. దేశీయంగా కీలక ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ కంపెనీల షేర్లు భారీగా దిద్దుబాటుకు గురవడంతో సూచీలు అత్యధిక నష్టాలను ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 410.28 పాయింట్లు పతనమై 59,667 వద్ద క్లోజయింది. నిఫ్టీ 106.50 పాయింట్లు కోల్పోయి 17,748 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతానికి పైగా పతనమైంది. ఐటీ, మీడియా, ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఫార్మా రంగాలు స్వల్పంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, టైటాన్, కోటక్ బ్యాంక్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.12 వద్ద ఉంది.

Tags:    

Similar News