బైడెన్, అమెరికా మాజీ అధ్యక్షులు సంచలన ప్రకటన

వాషింగ్టన్: కరోనా టీకాపై భయాందోళనలకు చెక్ పెట్టడానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సహా, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌లు నడుం బిగించారు. వ్యాక్సిన్‌పై అపనమ్మకాలకు తావులేదని, ఈ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి రెడీ అని సంచలన ప్రకటన చేశారు. తక్కువ ముప్పు ఉన్నవారికి టీకా ఇచ్చేటప్పుడు ఆన్ రికార్డులో వ్యాక్సిన్ వేసుకుంటామని తెలిపారు. ఫలానా టీకా సేఫ్ అని వైట్‌హౌస్ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు, అంటువ్యాధుల నిపుణుడు […]

Update: 2020-12-04 06:18 GMT

వాషింగ్టన్: కరోనా టీకాపై భయాందోళనలకు చెక్ పెట్టడానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సహా, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌లు నడుం బిగించారు. వ్యాక్సిన్‌పై అపనమ్మకాలకు తావులేదని, ఈ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి రెడీ అని సంచలన ప్రకటన చేశారు. తక్కువ ముప్పు ఉన్నవారికి టీకా ఇచ్చేటప్పుడు ఆన్ రికార్డులో వ్యాక్సిన్ వేసుకుంటామని తెలిపారు. ఫలానా టీకా సేఫ్ అని వైట్‌హౌస్ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ తెలిపితే తప్పకుండా ఆ వ్యాక్సిన్ వేసుకుంటానని డెమొక్రాట్ నేత బరాక్ ఒబామా చెప్పారు.

టీవీ కెమెరా ముందు లేదా రికార్డు చేస్తుండగా వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధమని తెలిపారు. తామూ కెమెరా ముందు ఈ టీకా తీసుకుని వ్యాక్సినేషన్‌ను ప్రమోట్ చేయడానికి రెడీ అని రిపబ్లికన్ నేత జార్జ్ బుష్, డెమొక్రాట్ లీడర్ బిల్ క్లింటన్‌లు పేర్కొన్నారు. ఫౌచీ సేఫ్ అని చెబితే ప్రభుత్వ ఆమోదానంతరం టీకాను బహిరంగంగా తీసుకోవడానికి రెడీ అని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. టీకా వేసే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకువచ్చిన ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులను ప్రశంసించారు.

Tags:    

Similar News