తనను తాను కాల్చుకున్న ఐపీఎస్ అధికారి
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి తన కార్యాలయంలోనే తనను తాను కాల్చుకున్న ఘటన సంచలనం రేపింది. శనివారం మణిపూర్‌లోని రైఫిల్స్ కాంపౌడ్‌లోని తన కార్యాలయంలోనే సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ షూట్ చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన సదరు అధికారులు అరవింద్ కుమార్‌ను సమీపంలోని రాజ్ మెడిసిటీకి తరలించారు. అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైద్యుల చికిత్సకు అరవింద్ స్పందిస్తున్నాడని.. ఆరోగ్యం మెరుగుపడగానే ఢిల్లీకి తరలిస్తామని వెల్లడించారు. అయితే, తాను […]
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి తన కార్యాలయంలోనే తనను తాను కాల్చుకున్న ఘటన సంచలనం రేపింది. శనివారం మణిపూర్‌లోని రైఫిల్స్ కాంపౌడ్‌లోని తన కార్యాలయంలోనే సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ షూట్ చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన సదరు అధికారులు అరవింద్ కుమార్‌ను సమీపంలోని రాజ్ మెడిసిటీకి తరలించారు. అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైద్యుల చికిత్సకు అరవింద్ స్పందిస్తున్నాడని.. ఆరోగ్యం మెరుగుపడగానే ఢిల్లీకి తరలిస్తామని వెల్లడించారు. అయితే, తాను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడో వివరాలు తెలియాల్సి ఉంది. అరవింద్ కుమార్ 1992 బ్యాచ్, మణిపూర్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అని తెలుస్తోంది.