సీనియ‌ర్ జ‌ర్నలిస్టు ఆత్మహత్య.. కలకలం రేపుతోన్న సూసైడ్ నోట్

దిశ‌, న‌ర్సాపూర్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ సీనియర్ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న‌ర్సాపూర్ ప‌ట్టణానికి చెందిన ప్రవీణ్‌ గౌడ్(46) వార్త పత్రిక రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ‌త కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌తమవుతున్నాడు. దీనికి తోడు వార్త సంస్థ యాడ్స్ కోసం పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాఫ్ రిపోర్టర్ తమ సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో పెడింగ్ […]

Update: 2021-10-02 10:39 GMT

దిశ‌, న‌ర్సాపూర్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ సీనియర్ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న‌ర్సాపూర్ ప‌ట్టణానికి చెందిన ప్రవీణ్‌ గౌడ్(46) వార్త పత్రిక రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ‌త కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌తమవుతున్నాడు. దీనికి తోడు వార్త సంస్థ యాడ్స్ కోసం పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాఫ్ రిపోర్టర్ తమ సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో పెడింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని మెసేజ్‌లు పెడుతూ అందరి ముందు పరువును తీసున్నారని, యాడ్స్ కోసం మానసికంగా హింసించడం ద్వారానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి చెరువులో దూకాడు.

అంతేగాకుండా.. తన భార్యకు న‌ర్సాపూర్ స‌మీపంలో ఉన్న బీవీఆర్ఐటీ సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి రాష్ర్ట మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ ప‌ర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగ‌రాజు తెలిపారు. 25 సంవత్సరాల నుంచి జ‌ర్నలిస్టుగా కొనసాగుతూ ప్రవీణ్ తన ప్రత్యేక‌త‌ను చాటుకున్నాడు. ఆయ‌న‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Tags:    

Similar News