రక్షణ రంగానికి ఇంత తక్కువ కేటాయింపులా ?: చిదంబరం

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు చేశారు. కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే రక్షణ రంగంలో కేటాయింపులు పెంచారని, చైనా నుంచి ముప్పు ఎదురవుతుంటే రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. లెక్కల గారడీతో రైతులు, వలస కూలీలను మోసం చేశారని, ప్రజారోగ్యానికి కేటాయింపులన్నీ మోసపూరితమేనన్నారు. రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారో చెప్పలేదన్న చిదంబరం.. పారిశ్రామిక వర్గాలకు కూడా ప్రోత్సాహకాలు […]

Update: 2021-02-01 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు చేశారు. కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే రక్షణ రంగంలో కేటాయింపులు పెంచారని, చైనా నుంచి ముప్పు ఎదురవుతుంటే రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. లెక్కల గారడీతో రైతులు, వలస కూలీలను మోసం చేశారని, ప్రజారోగ్యానికి కేటాయింపులన్నీ మోసపూరితమేనన్నారు. రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారో చెప్పలేదన్న చిదంబరం.. పారిశ్రామిక వర్గాలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News