భూపాలపల్లిలో కరోనా పాజిటివ్

దిశ, వరంగల్: రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందనుకునేలోపే తిరిగి విజృంభిస్తోంది. మొన్నటిదాకా ఒక్క జీహెచ్‌ఎంసీ మినహా అన్నిజిల్లాల్లో కేసులు జీరోగా నమోదయ్యాయి. ఎప్పుడైతే లాక్ డౌన్ ఆంక్షలు సడలించారో, వలస కార్మికులను తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని పర్మిషన్ ఇచ్చారో నాటి నుంచి కరోనా కోరలు చాస్తోంది.ఈ క్రమంలోనే శుక్రవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబు పేటలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కొద్ది రోజుల కిందట ముంబైకి వెళ్లిన వృద్ధ దంపతులు ఇటీవలే […]

Update: 2020-05-22 08:57 GMT

దిశ, వరంగల్:
రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందనుకునేలోపే తిరిగి విజృంభిస్తోంది. మొన్నటిదాకా ఒక్క జీహెచ్‌ఎంసీ మినహా అన్నిజిల్లాల్లో కేసులు జీరోగా నమోదయ్యాయి. ఎప్పుడైతే లాక్ డౌన్ ఆంక్షలు సడలించారో, వలస కార్మికులను తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని పర్మిషన్ ఇచ్చారో నాటి నుంచి కరోనా కోరలు చాస్తోంది.ఈ క్రమంలోనే శుక్రవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబు పేటలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కొద్ది రోజుల కిందట ముంబైకి వెళ్లిన వృద్ధ దంపతులు ఇటీవలే స్వగ్రామమైన నవాబుపేటకు వచ్చారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వారితో కాంటాక్ట్ ఉన్న వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News