అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు
దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు సోమవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే […]
దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు సోమవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ ఏ3 నిందితుడిగా ఉన్నారు.